News December 14, 2025
రాజోలి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌంటింగ్‌లో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 18, 2025
కాలసర్ప దోషం: గుర్తించే విధానమిదే..

కాలసర్ప దోషం తీవ్రమైన ప్రభావం చూపుతుందట. ఇది ఉన్న వ్యక్తికి 42 ఏళ్ల పాటు వైఫల్యాలు, మానసిక ఒత్తిడి, వృత్తిలో అభివృద్ధి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ దోషాన్ని గుర్తించడానికి సూచనలు కలలు అని పండితులు చెబుతున్నారు. కలలో పాములు కనిపించడం తీవ్రమైన కాలసర్ప దోషానికి సంకేతాలుగా భావిస్తారట. ఇలాంటి కలలు వస్తే వెంటనే శివుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వంటి నివారణలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 18, 2025
ఈరోజు చివరి అవకాశం!

మార్గశిర మాసంలో గురువార వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ నెలలో ఇదే చివరి గురువారం. ఈ వ్రతంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతారు. సంపద, సంతోషం, శ్రేయస్సు ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ వ్రతం చేస్తారు. ఇది మార్గశిరంలో ఏ ఒక్క గురువారం చేసినా సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వలన మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజును వినియోగించుకోండి.
News December 18, 2025
ధనుర్మాసం: మూడోరోజు కీర్తన

‘బలి చక్రవర్తి నుంచి 3 అడుగులు దానం పొందిన వామనుడు ఆకాశమంత పెరిగి 3 లోకాలను పాలించాడు. ఆ మూర్తి దివ్య చరణాలు స్మరించి, నామగానం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. భక్తితో ఆచరిస్తే నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. గోవులకు గ్రాసం లభిస్తుంది. పంటలు సమృద్ధిగా పండి దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకానికి మంచి చేసే ఈ వ్రతాన్ని చేద్దాం’ అని గోదాదేవి తన సఖులను ఆహ్వానిస్తోంది. <<-se>>#DHANURMASAM<<>>


