News October 16, 2025
రాజోలి: బండేనక బండి సుంకేసులకు గండి

రాజోలిలోని సుంకేసుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బుధవారం ఎద్దుల బండ్లతో గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో టిప్పర్ యజమానులు ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇటీవల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేశారు. ఇసుక అక్రమ నిల్వలు ఏర్పాటు చేస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 16, 2025
మొబైల్‌తో వెళ్తే అలాగే కూర్చుండిపోతారు!

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం బాత్రూమ్‌లో ఫోన్ వాడటం ఆపేయాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చుంటే మలసిరలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ‘ముఖ్యంగా బాత్రూమ్‌లో ఫోన్ వాడకండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. వెస్ట్రన్ కమోడ్ ఉపయోగిస్తే చిన్న స్టూల్‌పై కాళ్లు ఉంచండి. హ్యాండ్ వాష్ చేసుకోండి ’ అని తెలిపారు.
News October 16, 2025
‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలతో తెరపైకి వచ్చిన ‘డెక్కన్ సిమెంటు’పై చర్చ జరుగుతోంది. సూర్యాపేట(D)లో ఈ కంపెనీ 73 Acr అటవీ భూమిని ఆక్రమించిందని ఫిర్యాదులు రాగా గ్రీన్‌ట్రిబ్యునల్ విచారించింది. అటు కేంద్ర అటవీశాఖ కూడా ఆక్రమణలపై దర్యాప్తు చేయాలని 10 రోజుల క్రితం రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర అటవీశాఖ విచారిస్తోంది. ఆక్రమణ ఏమేరకు ఉందో త్వరలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.
News October 16, 2025
పార్వతీపురం: వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా 22 పోస్ట్‌లు

ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మదరావు తెలిపారు. మన్యం జిల్లాలో పశువైద్య అధికారుల పోస్టులు 21, సహాయ సంచాలకుని పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్నట్లు గురువారం చెప్పారు. 80 పశు వైద్య భవనాలకు గానూ 41 పశువైద్య భవనాలకు మరమ్మతులు, 28 నూతన పశువైద్య భవనాల ఏర్పాటు కోసం పైఅధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు.