News October 25, 2025

రాజోలి మండలంలో అత్యధిక వర్షపాతం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గద్వాల జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున రాజోలి మండలంలో అత్యధికంగా 37.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అయిజలో 21.0 మి.మీ., కేటీదొడ్డిలో 19.8 మి.మీ., వడ్డేపల్లిలో 11.0 మి.మీ. వర్షం కురిసింది. ధరూర్, ఉండవెల్లిలో స్వల్పంగా 0.5 మి.మీ. నమోదైంది.

Similar News

News October 25, 2025

NLG: టార్పాలిన్ కవర్లు లేక రైతుల తీవ్ర అవస్థలు

image

నల్గొండ జిల్లాలో టార్పాలిన్ కవర్లు లేక రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ కవర్ల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కిరాయి కవర్ల భారం తడిసిమోపడవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం కవర్లు అందించడం లేదని తెలిపారు.

News October 25, 2025

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

image

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.

News October 25, 2025

GWL: బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష కమిటీ సమావేశం

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో గద్వాల పట్టణంలో రేపు అఖిలపక్ష కమిటీ సమావేశం ఉంటుందని కమిటీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో సాయంత్రం 5:00 జరిగే సమావేశానికి బీసీ సంఘాలు, అఖిలపక్ష కమిటీ నేతలు తప్పక హాజరు కావాలన్నారు. బీసీల రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుందన్నారు.