News February 28, 2025
రాజోలులో అగ్నిమాపక అధికారి మృతి

ఒక్కరోజు డ్యూటీ చేసుంటే పూర్తిగా విశ్రాంతి తీసుకునేవారు. అంతలోనే ఆకస్మికంగా మృతి చెందారు. రాజోలు గాంధీనగర్‌లో ఉంటున్న అగ్నిమాపక అధికారి బాలకృష్ణ (62) నిన్న ఉదయం మృతిచెందారు. రాజోలు అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేసి 3నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. రోజూ మాదిరిగానే బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా రాజోలులో ఆకస్మికంగా బైక్‌పై నుంచి పడి చనిపోయారు.
Similar News
News February 28, 2025
హరీశ్ రావుపై మరో కేసు నమోదు

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.
News February 28, 2025
D-Streetలో బ్లడ్‌బాత్: నష్టాల్లో 28ఏళ్ల రికార్డు బ్రేక్

స్టాక్‌మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. సంపద సృష్టిలో కాదు. హరించడంలో! ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నేడు బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగియడం ఖాయమే. అంటే నిఫ్టీ వరుసగా 5 నెలలు నష్టాల్లో క్లోజైనట్టు అవుతుంది. 28 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 22,118 (-425), సెన్సెక్స్ 73,204 (-1400) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.7L కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సూచీలన్నీ విలవిల్లాడుతున్నాయి.
News February 28, 2025
పెద్దపల్లి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.