News January 24, 2025
రాజోలు: ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాజోలు మండలం కూనవరం గ్రామంలో శ్రీఅన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భూమి పూజలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 1, 2026
బాపట్ల: కొత్త ఏడాదైనా ‘కంది’ కరుణించేనా..?

కొరిశపాడు మండలంలోని 43 చౌకధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ గురువారం మొదలవగా, కందిపప్పు సరఫరాపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. గత సంవత్సరం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం నుంచి కందిపప్పు ఆశించిన స్థాయిలో అందలేదని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనైనా అందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంక్రాంతికి కిలో గోధుమ పిండిని రూ.20కే సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్‌లో 928, ఫ్యూచర్ సిటీలో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్‌గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.


