News September 6, 2025
రాజోలు: గురువుకు గుడి కట్టిన శిష్యులు

విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడికి ఆయన శిష్యులు దైవంగా భావించి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చింతలపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉత్తమ ఉపాధ్యాయులు, రెడ్ క్రాస్ అవార్డు గ్రహీత గుబ్బల రంగారావు శిష్యులు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి సూర్యనారాయణరాజు ఆవిష్కరించారు.
Similar News
News September 6, 2025
ఉపవాసం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

విష్ణువు భక్తుల్లో చాలామంది శనివారం నాడు ఉపవాసం ఉంటారు. దీనివల్ల దైవానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘ఉపవాసం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి. కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్, BP అదుపులో ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.
News September 6, 2025
బొజ్జ గణపయ్య! మళ్లీ రావయ్యా!

మా పూజలందుకోవడానికి కైలాసం నుంచి భూమి మీదకి వచ్చిన బొజ్జ గణపయ్య! ఇప్పుడు నిన్ను సాగనంపే సమయం ఆసన్నమైంది. భక్తితో నిమజ్జనం చేసి, నిన్ను మళ్లీ వచ్చే సంవత్సరం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మీ తల్లి గంగమ్మ ఒడికి చేరి, మళ్లీ వచ్చే ఏడాది మా ఇళ్లలో, గల్లీల్లో అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వ విఘ్నాలను తొలగించి, ఆనందంతో మమ్మల్ని ఆశీర్వదించు. గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా!
News September 6, 2025
నిజాంపేటలో తల్లి, ఇద్దరు పిల్లల మృతిపై విచారణ

నిజాంపేటలో తల్లి, ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతిపై <<17628346>>పోలీసులు విచారణ<<>> ప్రారంభించారు. ప్రేమల, ఆమె కొడుకులు ధనుష్, సూర్యవంశీ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ పి.వి. చరణ్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం సైతం వివరాలు సేకరిస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.