News April 24, 2025
రాజోలు: ‘విధి వెక్కిరించినా విజయం సాధించాడు’

రాజోలుకు చెందిన చెల్లుబోయిన బాబికి పుట్టుకతో రెండు చేతులు మోచేతి వరకు మాత్రమే ఉన్నాయి. అయినా అతని అంకుటిత దీక్ష, పట్టుదల ముందు అవి ఏమాత్రం అడ్డంకి కాలేదు. ప్రతిరోజు బాలుర జడ్పీహెచ్ స్కూల్‌కి వెళ్తూ బాబి పట్టుదలతో పదో తరగతి చదువుకున్నాడు. పరీక్ష రాసేందుకు హెల్పర్‌ను ఇస్తామని ఉపాధ్యాయులు చెప్పినా సున్నితంగా తిరస్కరించాడు. రెండు మోచేతులతో కలం పట్టి పరీక్ష రాసి మెరిశాడు.
Similar News
News April 24, 2025
రైతులకు భూ భారతి భరోసా: WGL కలెక్టర్

పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 24, 2025
నందలూరు: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

నందలూరు మండలం ఎర్ర చెరువు పల్లెకు చెందిన హత్య కేసులో నిందితుడు నాగ ప్రతాప్ రెడ్డిని నాగిరెడ్డిపల్లి గ్రామం పాత R&B బంగ్లా వద్ద అరెస్ట్ చేసినట్లు రాజంపేట ASP మనోజ్ రామనాధ్ హెగ్డే తెలిపారు. గురువారం ఆయన వివరాల మేరకు.. నిందితుడు 2024 జూలై 27న తన కోడిపుంజును దొంగిలించాడని సాతుపల్లి వెంకట రెడ్డి తిట్టడంతో అతన్ని హతమార్చాడు. అప్పటి నుండి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడన్నారు.
News April 24, 2025
భానుడి భగభగలు.. ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

TG: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.3, ఆదిలాబాద్-45.2, నిర్మల్-45.2, మంచిర్యాల-45.1, ఆసిఫాబాద్-45, నల్గొండ-44.9, కామారెడ్డి-44.6, కరీంనగర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. ఐఎస్ సదన్‌లో అత్యధికంగా 42, మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.