News April 1, 2024
రాజోలు: 578 ఓట్ల తేడాతో MLA అయ్యాడు!
రాజోలులో 1952-2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగితే.. 3సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో MLA పీఠం దక్కించుకున్నారు. 1989లో ఎం.గంగయ్య(కాంగ్రెస్‘ఐ’) AVS నారాయణరాజు(TDP)పై 611 ఓట్ల తేడాతో గెలవగా.. 1999లో AVS నారాయణరాజు(TDP) ఏ.కృష్ణంరాజు(కాంగ్రెస్‘ఐ’)పై 578 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జనసేన నుంచి బరిలో దిగిన రాపాక బి.రాజేశ్వరరావు(వైసీపీ)పై 814 ఓట్ల తేడాతో గెలిచినా.. ఆయన తర్వాత వైసీపీలో చేరారు.
Similar News
News November 23, 2024
పిఠాపురం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఛైర్మన్‌గా కాకినాడ కలెక్టర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ MLAగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
News November 23, 2024
తూ.గో: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
పీ.యు.సీ. కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన కూన రవి కుమార్ మైన్స్ & జియాలజీ, ఎక్సైజ్ శాఖా మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎంపికైన ఏలూరి సాంబశివరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి ఇతర సభ్యులతో కలసి రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
News November 22, 2024
తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్
పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.