News March 20, 2025
రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 21, 2025
HYD: ఓయూ సర్కులర్‌పై హైకోర్టు స్టే

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
News March 21, 2025
ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News March 21, 2025
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఎం ఫార్మసీ (పీసీఐ) మొదటి, రెండు, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.