News March 20, 2025

రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

image

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్‌ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 16, 2025

నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

image

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.

News September 16, 2025

ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

image

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

News September 16, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

image

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.