News April 4, 2024

రాజ్యసభ ఎంపీగా మేడా ప్రమాణం

image

నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలో గురువారం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేటకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News February 21, 2026

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.

News February 21, 2026

రౌడీ షీటర్లపై అప్రమత్తంగా ఉండండి: కడప SP

image

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.