News February 28, 2026

రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

image

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.

Similar News

News February 28, 2026

275 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>సెంట్రల్ <<>>బ్యాంక్ ఆఫ్ ఇండియా 275 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech(CS,CA, IT, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ &టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్), MCA, MBA/MMS, PG(ఫైనాన్స్/ బ్యాంకింగ్), ICAI అర్హత గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://centralbank.bank.in

News February 28, 2026

కాలసర్ప దోషం పోవాలంటే?

image

కాలసర్ప దోష నివారణకు సోమవారం నల్ల నువ్వులతో శివాభిషేకం, మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘నాగపంచమి నాడు నాగేంద్రుని పూజించాలి. వెండి పాముల జతను నదిలో వదిలితే దోష తీవ్రత తగ్గుతుంది. శనివారం రావిచెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయాలి. నాసిక్‌లో శాంతి పూజలు నిర్వహించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి’ అని అంటున్నారు.

News February 28, 2026

కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

image

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.