News January 26, 2026

రాజ్యాంగ విలువలను కాపాడాలి: మన్యం కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని అధికారులను, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

image

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

News February 21, 2026

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

image

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

News February 21, 2026

ప్రేమ వివాహంపై పెద్దలకు సమాచారం: GJ ప్రభుత్వం

image

ప్రేమ వివాహాలపై పెద్దలకు సమాచారం ఇవ్వడాన్ని గుజరాత్ ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పెళ్లికి దరఖాస్తు చేసేవారు తమ పెద్దలకు సమాచారం ఇచ్చామని డిక్లరేషన్ ఇవ్వాలి. పైగా అమ్మాయి పేరెంట్స్‌కు అధికారులే అప్లికేషన్ షేర్ చేస్తారు. తప్పుడు సమాచారంతో వివాహాలు అడ్డుకునేందుకే GJ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వీ తెలిపారు.