News December 6, 2024
రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు: కలెక్టర్

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు ప్రాధమిక హక్కులు లభించాయని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు.
Similar News
News December 30, 2025
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 322 మంది మృతి చెందగా, 2024లో 429 మంది మరణించారు. దీంతో 25 శాతం మేర తగ్గుదల నమోదైంది. అలాగే ఈ సంవత్సరం 76 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 6% తగ్గాయి. ఈ కేసులలో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారంతో కూడినవిగా ఉన్నవి.
News December 30, 2025
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.
News December 29, 2025
REWIND: ఈ ఏడాది గుంటూరు జిల్లాలో క్రూరమైన ఘటన ఇదే..!

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాల్లో ఫిరంగిపురంలో చోటుచేసుకున్న చిన్నారి హత్య అత్యంత హృదయవిదారక ఘటనగా మిగిలిపోయింది. మార్చి 29న ప్రకాశం పంతులు కాలనీలో సవతి తల్లి లక్ష్మి కిరాతకానికి ఆరేళ్ల కార్తీక్ బలైపోయాడు. పసివాడని కూడా చూడకుండా గోడకేసి కొట్టి చంపిన తీరు ప్రజలను కంటతడి పెట్టించింది. మరో చిన్నారిని సైతం పెనంపై కూర్చోబెట్టి హింసించిన లక్ష్మి రాక్షసత్వం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.


