News January 17, 2026

రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

image

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.

Similar News

News February 21, 2026

చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

image

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.

News February 21, 2026

కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

image

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT

News February 21, 2026

గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

image

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.