News November 17, 2025
రాత్రిళ్లు, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువుగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>