News December 19, 2025
రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్స్ తక్కువ ప్రమాదకరమా?

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్‌లు తక్కువ ప్రమాదకరమని తాజా స్టడీలో వెల్లడైంది. డేటైమ్‌లో న్యూట్రోఫిల్స్ యాక్టివ్‌గా ఉండడంతో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి గుండెకు నష్టం ఎక్కువ జరుగుతున్నట్టు గుండెపోటుకు గురైన 2వేల మంది రికార్డులు పరిశీలించి గుర్తించారు. CXCR4 రిసెప్టర్లు పెంచి న్యూట్రోఫిల్స్ కదలికలను నియంత్రించే పరిశోధనలను ఎలుకలపై చేపట్టారు. న్యూట్రోఫిల్స్ తీవ్రతను తగ్గించే మందుల తయారీపై దృష్టిపెడుతున్నారు.
Similar News
News December 22, 2025
మీకు తెలుసా?.. ఆ ఊరిలో ఒక్కరే ఉంటారు!

ఒక ఊరికి ఒక్కరే రాజు, ఒక్కరే బంటు అంటే వినడానికి వింతగా ఉన్నా.. అమెరికాలోని ‘మోనోవి’లో ఇదే జరుగుతోంది. 89 ఏళ్ల ఎల్సీ ఐలర్ ఆ ఊరిలో ఏకైక నివాసి. ఏటా తనకు తానే ఓటు వేసుకుని మేయర్‌గా గెలుస్తారు. సెక్రటరీగా సంతకాలు చేస్తూ, తన హోటల్ కోసం తానే లైసెన్సులు ఇచ్చుకుంటారు. ఊరి మనుగడ కోసం పన్నులు చెల్లిస్తుంటారు. భర్త జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ, ఒక హోటల్ నడుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
News December 22, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News December 22, 2025
Credit Card Scam: లిమిట్ పెంచుతామంటూ..

‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న చందంగా మారింది సైబర్ మోసగాళ్ల పని. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఈ మధ్య కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. కాల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు సంస్థలకు చెందిన వాళ్లమని నమ్మబలుకుతారు. OTP, CVV వంటి కీలక సమాచారాన్ని లాగుతారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు పేరిట లింక్ పంపి బురిడీ కొట్టిస్తారు.


