News October 8, 2025

రాధికను అభినందించిన ఎస్పీ జానకి

image

కాంస్య పతకం సాధించిన అడ్డాకల్ PSకు చెందిన కానిస్టేబుల్ రాధికను MBNR ఎస్పీ డి.జానకి అభినందించారు. హరియాణాలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్(ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్)–2025-26లో తెలంగాణ పోలీస్ బృందం తరపున పాల్గొన్న రాధిక 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు. దీంతో రాధికను తన చాంబర్‌లో శాలువా కప్పి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Similar News

News October 8, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.

News October 8, 2025

KMR: కలెక్టర్ చొరవ.. బాలికలకు ISRO టూర్

image

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో 10వ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ప్రభుత్వ ఖర్చుతో ISRO టూర్‌కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. ఈ పర్యటన కోసం బుధవారం స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌కు జిల్లా విద్యార్థులు, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

News October 8, 2025

KMR: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలి: SEC

image

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.