News October 15, 2025
రానున్న 3 గంటల్లో సత్యసాయి జిల్లాలో భారీ వర్షం

రానున్న 3 గంటల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చెట్ల కింద ఎవరూ నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలోని హిందూపురం, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడుతోంది.
Similar News
News October 15, 2025
వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సక్సెస్: కలెక్టర్

14, 15వ తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విజయవంతమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. 150 మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
News October 15, 2025
CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.
News October 15, 2025
గద్వాల: బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశం

జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్, సుకన్య సమృద్ధి యోజన, పీఎం మాతృ వందన యోజన వంటి పథకాలను మోర్చా నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.