News January 17, 2026

రానున్న 5 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 21, 2026

లొంగు‘బాట’లో దేవ్‌జీ?

image

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.

News February 21, 2026

ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

image

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/

News February 21, 2026

చర్మానికి బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.