News November 3, 2025

రాబోయే 2 గంటల్లో వర్షం: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ సమయంలో 40-50kmph వేగంతో గాలులు వీస్తాయని, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.

Similar News

News November 4, 2025

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.

News November 4, 2025

‘పెద్ది’ మూవీ అప్డేట్ ఇచ్చిన AR రహ్మాన్

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి AR రెహమాన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెహ్మాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న పిక్ షేర్ చేసి.. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు?’ అని రామ్ చరణ్ ప్రశ్నించారు. అందుకు ‘చికిరి చికిరి.. చరణ్ గారు’ అని రెహమాన్ సమాధానమిచ్చారు. అంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోందని చెప్పకనే చెప్పేశారు. అయితే రిలీజ్ ఎప్పుడో మాత్రం చెప్పలేదు.

News November 4, 2025

నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్‌ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.