News October 29, 2025
రాబోయే 4 రోజులు కీలకం: మంత్రి సత్యకుమార్

మొంథా తుఫాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో సమీక్షిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలోని 2,555 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం ద్వారా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన తెలిపారు.
Similar News
News October 30, 2025
విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 30, 2025
తిరుమలలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్పయాగానికి బుధవారం రాత్రి అంకురార్పణ జరిగింది. గురువారం పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ చేపట్టారు. దీంతో సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో ఆలయ పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి: సీఎంఓఏఐ

జిల్లా బార్ అసోసియేషన్ వారు సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అసోసియేషన్ వారు అన్నారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటికే పైలట్ కాలనీ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కోర్టుకు ఇచ్చామన్నారు. అదే విధంగా న్యాయమూర్తుల కోసం సింగరేణి క్వార్టర్లను, బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్ మైనారిటీ పాఠశాలకు, 70కి పైగా క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు ఇచ్చామన్నారు.


