News January 1, 2026
రామగిరి: అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

పెద్దపల్లి(D) రామగిరి(M) నాగేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఎరుకల రాజేశం(60) గురువారం మధ్యాహ్నం మృతి చెందగా, కుమారుడు శ్రీకాంత్ (37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కొడుకులు అరగంట వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.
Similar News
News February 17, 2026
HYD: ఆరోన్ జార్జ్‌ను సన్మానించిన మంత్రి!

భారత అండర్-19 బ్యాటర్ ఆరోన్ జార్జ్ వర్గీస్‌ను HYDలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సన్మానించారు. 38 ఏళ్ల తర్వాత HYDకు ‘వినూ మన్కడ్ ట్రోఫీ’ని అందించిన కెప్టెన్‌గా, ఆసియా కప్‌లో రాణించిన వర్గీస్ ప్రతిభను మంత్రి కొనియాడారు. భవిష్యత్తులో వర్గీస్ మరిన్ని విజయాలు సాధించి భారత క్రికెట్‌లో ధ్రువతారగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
News February 17, 2026
కాంగ్రెస్ ములుగు జిల్లా మండలాల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ములుగు- బానోత్ రవిచందర్, కుంజా సూర్యారామ్, మారం సుమన్ రెడ్డి
వెంకటాపూర్- గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కొండం రవీందర్ రెడ్డి
గోవిందరావుపేట- బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇస్సార్ ఖాన్
తాడ్వాయి- గుమ్మడి సోమయ్య, శ్రీనివాస్ రెడ్డి, తాజుద్దీన్
ఏటూరునాగారం- చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, అర్రెం లచ్చుపటేల్
కన్నాయిగూడెం- రేగ కళ్యాణి, యానయ్య
మంగపేట- రఘు, దేవేందర్, శ్రీనివాస్
మల్లంపల్లి- రవియాదవ్, జైపాల్ రెడ్డి
News February 17, 2026
26న నెల్లూరుకు జగన్..!

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.


