News December 24, 2025
రామగిరి: ‘ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలి’

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను నిరుద్యోగ యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ వంటి శిక్షణలతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, గతంలో శిక్షణ పొందిన పలువురు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అయ్యారని అన్నారు.
Similar News
News December 29, 2025
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. వాళ్లిద్దరికీ రెస్ట్?

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని cricbuzz తెలిపింది. అయితే ODIలకు దూరమైనా NZతో 5T20ల సిరీస్‌లో మాత్రం ఆడతారని పేర్కొంది. జనవరి 11-31 మధ్య 3 ODIలు, 5T20లు జరగనున్నాయి. ODIల్లో వెటరన్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడనున్నారు.
News December 29, 2025
ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.
News December 29, 2025
హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

<


