News June 30, 2024
రామగిరి: కానిస్టేబుల్ సస్పెన్షన్

పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సదానందంను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినా, విధులలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.
Similar News
News December 14, 2025
కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాల్లో పోలింగ్

కరీంనగర్ జిల్లాలో నేడు రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు.మానకొండూర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 111 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1046 వార్డుల్లో 197 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 849 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ బరిలో 436 మంది, వార్డు సభ్యులుగా 2275 మంది ఉన్నారు. 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 13, 2025
రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
News December 13, 2025
ఇందుర్తి: ప్రచారం ముగిసినా ఆన్‌లైన్ పోల్.. కేసు నమోదు

చిగురుమామిడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మాక్ పోల్’ నిర్వహించిన ఘటనపై కేసు నమోదైంది. ఇందుర్తి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థుల పేర్లతో పోల్ నిర్వహించడం ద్వారా ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘించారని మండల నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


