News December 27, 2025
రామగిరి ఖిల్లాకు టూరిజం కళ

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారబోతోంది. అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించి పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులతో పరిసర గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.
Similar News
News December 31, 2025
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రచురణలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. వివిధ పార్టీల నేతలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
News December 31, 2025
కామారెడ్డి: న్యూ ఇయర్.. చికెన్, ఫిష్ మార్కెట్లలో సందడి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. 2026కు స్వాగతం పలికేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. దీంతో బుధవారం కామారెడ్డి జిల్లాలోని చికెన్, ఫిష్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా చేపల ధరలు సాధారణం కంటే అధికంగా పలికాయి. అయినప్పటికీ పండుగ జోష్‌లో ప్రజలు కొనుగోలుకు వెనుకాడలేదు. మీ ప్రాంతంలో కొత్త ఏడాది వేడుకల సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News December 31, 2025
కాకినాడ ఎంపీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 2025లో కనబరిచిన అత్యుత్తమ పనితీరును పార్లమెంటు బుధవారం వెల్లడించింది. ఆయన మొత్తం 90 శాతం హాజరు నమోదు చేయగా, 17 చర్చల్లో పాల్గొని 58 ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలకు 100 శాతం హాజరై తన నిబద్ధతను చాటుకున్నారు. ఎంపీ పనితీరుపై పార్టీ నాయకత్వం హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ చూపుతున్నారు.


