News March 28, 2025

రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహించేంది ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. వైసీపీ ఎంపీటీసీలకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులపై పోలీసులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News November 5, 2025

‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

image

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News November 5, 2025

అనకాపల్లి: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

image

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పుణ్య దినం కార్తీక పౌర్ణమి. బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఉన్న శివాలయాలు సందడిగా కనిపించాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటున్నారు. కాశీబుగ్గ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివ పంచాక్షరి నామంతో ఆలయాలు
మార్మోగుతున్నాయి.

News November 5, 2025

ట్రంప్ పార్టీ ఓటమి

image

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.