News October 11, 2025

రామగిరి: హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

రామాగిరి సెంటినరీకాలనీలో కోట చిరంజీవిని హత్య చేసిన నిందితుల్ని శనివారం అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ గౌడ్ తెలిపారు. పెంచికల్ పేట్‌కు చెందిన సంధ్యా రాణిని చిరంజీవి వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. వేధింపులు ఎక్కువ కావడంతో సంధ్యా రాణి తన అన్న, భర్త, తండ్రి, బావమరిదిలతో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు ఆసీఫ్ తెలిపారు.

Similar News

News October 11, 2025

కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

image

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.

News October 11, 2025

అంతర్వేదిలో నటుడు సునీల్ సందడి

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సునీల్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను సునీల్‌కు అందజేశారు.

News October 11, 2025

తిరుపతి: మురికి కాలువలో 6 నెలల చిన్నారి

image

తిరుపతి సింగాలగుంట మసీదు వీధిలో శనివారం విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 నెలల చిన్నారిని మురికి కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే సానిటరీ సిబ్బందికి అలాగే వీఆర్వోకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటికి తీశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.