News April 16, 2025
రామగిరి హెలిప్యాడ్ ఘటన.. వారు విచారణకు వస్తారా?

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయాలని పైలెట్, కోపైలెట్‌కు చెన్నేకొత్తపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హాజరైతే హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.
Similar News
News April 16, 2025
ఏప్రిల్ 19న అనంత JNTUలో వార్షికోత్సవ వేడుకలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19న కళాశాల 79వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర్ తెలిపారు. దీనికి సంబంధించి కళాశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక, వికాసిక, క్రీడా కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి, సిబ్బంది ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 16, 2025
పామిడి విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
News April 16, 2025
రామగిరి ఎస్ఐని దూషించిన వారిపై కేసు

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదైంది. ఈ నెల 13న సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నారు.