News October 21, 2025
రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్

రామగుండంలో 80O మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA- MSరాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను HYDలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి గ్రామాలకు తాగు నీరు, పంటలకు సాగునీరు అందివ్వాలని కోరారు.
Similar News
News October 21, 2025
30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్

నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్‌వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 OCT20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా DDLJ దాన్ని అధిగమించింది.
News October 21, 2025
రైల్వే,ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జేసీ

విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిన రైల్వే, జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆమె సమావేశం నిర్వహించి, జిల్లా పరిధిలోని రైల్వే, ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్థితిగతులపై సమీక్షించారు.
News October 21, 2025
రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.