News November 7, 2025

రామగుండంలో PM అప్రెంటిషిప్ మేళా

image

RGM ప్రభుత్వ ఐటీఐలో NOV 10న ఉదయం 10 గంటలకు “ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా” నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ఎల్‌&టి, వరుణ్ మోటార్స్, స్నైడర్ ఎలక్ట్రికల్స్, తోషిబా, ఉషా ఇంటర్నేషనల్, కేశోరాం సిమెంటు వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటీఐ ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. అప్రెంటిషిప్ చేయదలచిన అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 7, 2025

₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

image

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్‌ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.

News November 7, 2025

విషం తాగి యువకుడు ఆత్మహత్య

image

మదనపల్లెలో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. 2టౌన్ సీఐ రాజారెడ్డి వివరాల మేరకు.. రామారావుకాలనీకి చెందిన నాగరాజ కొడుకు శివ(24)ను కుటుంబీకులు మందలించారు. మనస్థాపానికి గురైన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించి, తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News November 7, 2025

డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: మహబూబాబాద్ ఎస్పీ

image

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ అన్నారు. యూట్యూబర్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ ముఖ్ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఒక మంచి కార్యక్రమానికి చేపట్టారని, గత ఏడాది నుంచి కూడా మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సమాజంలో ఎంతో మంది యువకుల ఆలోచన ధోరణిని మార్చారని ప్రశంసించారు. ఈ మేరకు యాంటీ డ్రగ్స్ పోస్టర్‌ను ఎస్పీ ఈరోజు ఆవిష్కరించారు.