News October 30, 2025
‘రామగుండం అభివృద్ధి.. గడువులోగా పూర్తి చేయండి’

RMGలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. RMG మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TUFIDC సహా వివిధ పథకాల కింద జరుగుతున్న పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.
News October 30, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో నిర్వహించిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
News October 30, 2025
ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


