News March 1, 2025
రామగుండం: ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రకటించిన CGM

రామగుండంలోని ఎరువుల కర్మాగారం (RFCL) ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి 103912.38 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కర్మాగారంలో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్లాంటు CGMఉదయ్ రాజహంస ప్రకటించారు. ప్లాంటు అధికారులకు, ఉద్యోగులను CGM అభినందించారు.
Similar News
News February 25, 2026
GNT: మంత్రి లోకేశ్‌కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
News February 25, 2026
గణపవరం: టెన్త్ అర్హతతో 200 ఉద్యోగాలకు జాబ్ మేళా

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 26న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.పి.నిర్మల కుమారి చెప్పారు. ఈ మేళాలో జీఎల్, పేటీయం, డెక్కన్ కెమికల్స్ తదితర కంపెనీల్లో 200లకు పైగా ఖాళీలు ఉన్నాయని, 2023,24,25,26 సంవత్సరాల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు 26న (గురువారం) ఉదయం 10 గం.లకు డిగ్రీ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వలన్నారు.
News February 25, 2026
KNR: అగ్రనేతల లొంగుబాటు.. అజ్ఞాతంలో మిగిలింది ఒక్కరే!

పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీ వరకు దశాబ్దాల పాటు ఉద్యమ గమనాన్ని శాసించిన ఉమ్మడి KNR జిల్లా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు కేంద్ర కమిటీ(సీసీ)లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలోనే చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్‌రావు బయటకు రాగా.. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి ఒక్కరే అజ్ఞాతంలో మిగిలారు.


