News January 26, 2025

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ ఆమలులో వుంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

image

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.

News September 18, 2025

సినీ ముచ్చట్లు!

image

*పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్. పోస్టర్లు రిలీజ్
*నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ-2’ షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఓ పార్టీ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.
*‘సైయారా’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 9.3 మిలియన్ గంటల వ్యూయర్‌షిప్‌తో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ ఫిల్మ్‌గా నిలిచింది.

News September 18, 2025

భీమవరం: 5 బార్లను లాటరీ

image

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్‌కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.