News December 19, 2024

రామగుండం పోలీస్ స్టేషన్‌ను సీపీ తనిఖీ

image

రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS(IG) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది, కేసుల నమోదులు, రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.

Similar News

News February 5, 2025

KNR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్

image

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. మొత్తంగా 05.02.2025 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు.

News February 5, 2025

KNR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీ ఫాం అందజేత

image

కరీంనగర్, NZBD, ADLBD, MDK పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీఫాంను బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. తనపై పార్టీ నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంజిరెడ్డి తరఫున బీ ఫాంను ఆయన కుమార్తె తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News February 5, 2025

కరీంనగర్: జర్నలిస్టుల టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా శాఖ 2025 డైరీ ఆవిష్కరణ

image

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన 2025 డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్ లో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ఆవిష్కరించారు. జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ ఉపయోగపడే విధంగా డైరీని ముద్రించామని తెలిపారు.

error: Content is protected !!