News February 17, 2025
రామగుండం: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

రామగుండం పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో సోమవారం సీపీ ఎం.శ్రీనివాస్ నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను స్వీకరించి వాటిని సంబంధిత స్టేషన్ల సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు.
Similar News
News November 8, 2025
సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా గజవాడ వేణు

వేములవాడకు చెందిన జడ్జి గజవాడ వేణు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిర్యాలగూడ 5వ అదనపు న్యాయమూర్తి, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జి, హైదరాబాద్ 6వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 20వ ముఖ్య న్యాయాధికారిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
News November 8, 2025
చిత్తూరు, తిరుపతి జిల్లాలో నేటి ముఖ్యమైన కార్యక్రమాలు

☞ కుప్పం నియోజకవర్గంలో నేడు 7 కంపెనీలకు వర్చువల్‌గా<<18223647>> CM చంద్రబాబు శంకుస్థాపన<<>>
☞ రూ.2,203 కోట్ల పెట్టుబడులతో 22 వేల మందికి ఉపాధి
☞ నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న Dy.CM పవన్
☞ ఉదయం 8.05 రేణిగుంటకు వచ్చి అక్కడి నుంచి మామండూరు అటవీ క్షేత్రం చేరుకుంటారు
☞ ఉదయం 11 గంటలకు మంగళం రోడ్డులోని రెడ్ శాండిల్ గోడౌన్ తనిఖీ
☞ నేడు మధ్యాహ్నం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్న పవన్
News November 8, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు న్యాయమూర్తుల బదిలీ

కరీంనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆర్ శ్రీలతను సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా డీఎల్ఎస్ఏ సెక్రటరీ కే.వెంకటేష్‌ను మేడ్చల్ మల్కాజిగిరి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టుకు, పెద్దపల్లి డీఎల్ఎస్ఏ కే.స్వప్నరాణిని పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు.


