News February 11, 2025

రామగుండం: భాగ్యనగర్ రైలు యధావిధిగా కొనసాగించాలని వినతి

image

ఖమ్మం వద్ద రైల్వే పనులు జరుగుతుంటే భాగ్యనగర్ రైలును రద్దు చేయడం సరికాదని, యథావిధిగా పునరుద్ధరించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ రామగుండం రైల్వే స్టేషన్ DMసునీల్ కుమార్‌కు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యం వెళ్లే భాగ్యనగర్ రైలు తాత్కాలికంగా రద్దు చేయడం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతుందన్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు.

Similar News

News November 13, 2025

నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

image

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్‌లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.

News November 13, 2025

సముద్రతీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని పరిశవారిపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 13, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటాలు రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు. ప్రైవేటు ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.