News November 5, 2025
రామగుండం: ముడి సరుకుల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

రామగుండం ఐటీఐలో వివిధ ట్రేడ్స్‌లో అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకు రూ.6.48 లక్షల వ్యయంతో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఈ.సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 196 రకాల ముడి సరుకులు ఒకే ప్యాకేజీగా సరఫరా చేయడానికి ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు రామగుండం ఐటీఐ ప్రిన్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
Similar News
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News November 5, 2025
ADB: పిల్లర్ పడి బాలుడి దుర్మరణం

ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు పిల్లర్ పడి దుర్మరణం చెందిన విషాద ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంద్ర నగర్‌కు చెందిన దౌరే వీర్(7) బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా పిల్లర్ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
News November 5, 2025
సంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే.! (UPDATE)

కర్ణాటక రాష్ట్రం హాలికెడ్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన <<18203736>>నలుగురు వ్యక్తులు మృతి <<>>చెందారు. గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు నాగరాజు (35), నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60)తో ప్రతాప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


