News February 22, 2025
రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.
Similar News
News December 11, 2025
యాదాద్రి జిల్లాలో పోలింగ్ ప్రారంభం

యాదాద్రి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి. ఐలయ్య తన సతీమణితో కలిసి సైదాపురంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తన ఓటును వినియోగించుకుని మాట్లాడారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మండల అభివృద్ధి అయినా, గ్రామ అభివృద్ధి అయినా సర్పంచులతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
News December 11, 2025
వరంగల్: ఎలక్షన్ అప్‌డేట్ @8AM

☞ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 511 పంచాయతీలు, 3,793 వార్డులకు మొదలైన పోలింగ్
☞ చలిని లెక్కచేయకుండా ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలిన ఓటర్లు
☞ పర్వతగిరిలో ఓటు వేసిన ఎర్రబెల్లి దయాకర్
☞ రఘునాథపల్లిలో ఉదయాన్నే డబ్బు పంపిణీ.. అడ్డుకున్న స్థానికులు
☞ పోలింగ్ కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్‌లను నో ఎంట్రీ
☞ చెకింగ్ తర్వాత అనుమతిస్తున్న పోలీసులు
☞ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్
News December 11, 2025
గద్వాల: 4మండలాల్లో 1,31,679 మంది ఓటర్లు

గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికలు జరిగే 4మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. వాటిలో 14 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 పంచాయతీల్లో సర్పంచ్, 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. 92 గ్రామపంచాయతీలలో మొత్తం 1,31,679 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 66,994 మంది మహిళలు, 64,684 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఉన్నట్లు పేర్కొన్నారు.


