News October 4, 2025

రామగుండం: యూరియా ఉత్పత్తి ప్రారంభం

image

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించారు. AUG 14న పైప్‌లైన్ లీక్ వల్ల ప్లాంట్‌ను నిలిపివేశారు. సెప్టెంబర్ 28న మరమ్మతులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను తయారు చేస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగుతుండగా, HYDకు 25వేల మెట్రిక్ టన్నుల యూరియా రైలు ద్వారా పంపేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

Similar News

News October 4, 2025

PDPL: ముగిసిన పండుగలు.. కళ తప్పిన వేదికలు

image

గత నెలరోజులకు పైగా గణేష్, బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలతో సందడిగా మారిన పల్లెలు, పట్టణాల్లో వేడుకలు జరిగిన ప్రదేశాలు నేడు కళ తప్పి బోసిపోయి కనిపిస్తున్నాయి. గణపతి మండపాలను నిర్మించే సమయం నుంచి మొన్న ముగిసిన దసరా ఉత్సవాల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరు పండుగలను ఘనంగా నిర్వహించడానికి సహకరించారు. భజన కీర్తనలు, DJ సౌండ్ బాక్సుల మోతలతో ఆడిపాడిన ఉత్సవాల వేదికలు తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.

News October 4, 2025

రోహిత్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్!

image

భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు, T20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. AUSతో వన్డే సిరీస్‌కు ఆయనను కాదని <<17911822>>గిల్‌కు<<>> కెప్టెన్సీ అప్పగించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఆసీస్ సిరీస్‌ తర్వాత హిట్‌మ్యాన్ వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీరేమంటారు?

News October 4, 2025

ఖమ్మం: ప్రేమ పేరుతో మోసం.. యువతి అనుమానాస్పద మృతి

image

ప్రేమ పేరిట మోసం చేశాడని 3నెలలుగా ప్రియుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఓ యువతి చనిపోయింది. స్థానికుల వివరాలు.. పాల్వంచ వాసి ప్రియాంక, గట్టు(M) చిన్నోనిపల్లి వాసి PC రఘుగౌడ్‌ 4ఏళ్లుగా ప్రేమించుకోగా, ఇటీవల తనను దూరం పెడుతుండటంతో రఘు ఇంటి వద్దే ఆమె నిరసనకు దిగింది. ఈ రోజు యువతి మృతిచెందటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతికి రఘు బంధువులే కారణమని యువతి తరఫువారు ఆరోపిస్తున్నారు.