News December 19, 2025

రామగుండం: ‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

image

రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష భరోసా ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News December 22, 2025

NGKL: ఘనంగా మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

image

కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతి వేడుకలను నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి వెంకటస్వామి చేసిన సేవలను స్మరించుకున్నారు. అదనపు ఎస్పీతో పాటు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.

News December 22, 2025

HYD: మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి: సీపీ

image

రాచకొండ సీపీ సుధీర్ బాబు 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించి, రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో 495 మందిని అరెస్ట్ చేయగా, అందులో 322 మంది స్థానికులు, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందినవారని, 227 NDPS అనుమానిత షీట్లు తెరిచారమన్నారు. రాచకొండను నాన్-బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

News December 22, 2025

అల్లూరి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

image

ఎటపాక మండలం K.N.పురం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తెల్లం గౌతం అనారోగ్యం కారణంగా సోమవారం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విద్యార్థిది ఎటపాక మండలం కృష్ణవరం. విద్యార్థి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గౌతమ్ 6వ తరగతి నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు.