News February 4, 2025
రామగుండం: సింగరేణి కార్మికులకు క్యాష్ ప్రైజ్.. ఎందుకంటే..?

మరో 2 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టార్గెట్ రీచ్ అయితే కార్మికులకు క్యాష్ ప్రైజ్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాంతాల వారీగా, గనుల వారీగా లక్ష్యాన్ని చేరుకుంటే నగదు బహుమతులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ అవకాశాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కల్పించింది.
Similar News
News February 28, 2026
మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.
News February 28, 2026
విజయవాడలో మృతదేహం కలకలం

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కృష్ణా నదిలో శనివారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై కేవలం బనియన్ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
News February 28, 2026
ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక.. మే 13-14న కౌన్సిలింగ్: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ASF కలెక్టర్ కె.హరిత తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 13-17 మండల, మార్చి 28-ఏప్రిల్ 1 జిల్లా, ఏప్రిల్ 27-మే 1 రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికైన వారికి మే 13,14న కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.


