News February 10, 2025
రామగుండం: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్

బైకులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. దానిపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వస్తేనే.. పెట్రోలు పోస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని ట్రాఫిక్ CI రాజేశ్వర్ రావు సూచిస్తున్నారు.
Similar News
News November 17, 2025
HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.

భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.