News March 20, 2025
రామచంద్రపురం : పోలీసుల అదుపులో కసాయి తండ్రి..!

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు
Similar News
News March 20, 2025
కండక్టర్‌పై దాడి.. రాజంపేట సీఐ వార్నింగ్

ఈనెల 16వ తేదీన నందలూరు బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడి విషయంలో ఇరు వర్గాల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజంపేట రూరల్ సీఐ కుళ్లాయప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికురాలితో కండక్టర్ ప్రవర్తించిన తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం చెంది దాడి చేశారని, ప్రయాణికులు కండక్టర్‌తో ఆ మహిళకు సారీ చెప్పించడంతో సమస్య అక్కడే పరిష్కారం అయిందన్నారు. కలహాలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News March 20, 2025
బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
News March 20, 2025
‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.