News March 20, 2025
రామచంద్రపురం : పోలీసుల ఎదుట లొంగిపోయిన కసాయి తండ్రి

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.
Similar News
News March 2, 2026
ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్‌కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.
News March 2, 2026
తిరుమలలో ఘర్షణ.. అసలు నిజం ఇదే!

తిరుమల క్యూలైన్‌లో 10గంటల వెయిటింగ్, నీళ్లు ఇవ్వకపోవడంతో భక్తులు తోసుకుని <<19283067>>గొడవ <<>>మొదలైందని కొందరు దుష్ప్రచారం చేశారు. ‘కొంత మంది భక్తుల మధ్య మాటల కారణంగా స్వల్ప ఘర్షణ జరిగింది. వెంటనే శ్రీవారి భక్తులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నీళ్లు ఇవ్వకపోవడం గొడవకు కారణం కాదు. అసత్య వార్తలు వ్యాప్తి చేయడం నేరం. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం’ అని తిరుపతి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
News March 2, 2026
‘సిద్దిపేట సురక్ష నేత్ర’ను ప్రారంభించిన సీపీ

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన “సిద్దిపేట సురక్ష నేత్ర” సీసీటీవీ వ్యవస్థను సీపీ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. తొలి దశలో జిల్లావ్యాప్తంగా 200కు పైగా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నేరాల నివారణ, వేగవంతమైన విచారణతో పాటు ట్రాఫిక్ పర్యవేక్షణకు ఈ నిఘా నేత్రాలు కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.


