News April 4, 2025

రామచంద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రామచంద్రపురం బైపాస్ రోడ్‌లో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి చెందిన వీరి సాయి వెంకటకృష్ణ (20) మృతి చెందాడు. దాసరి శ్రీనుతో కలిసి బైక్‌పై కాకినాడ నుంచి స్వగ్రామం గంటి పెదపూడి వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటకృష్ణ అక్కడికక్కడే చనిపోగా దాసరి శ్రీను గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 15, 2025

జగిత్యాల బిడ్డకు ‘మిస్ చికాగో’ కిరీటం

image

న్యూజెర్సీలో ఈ నెల 12న నిర్వహించిన విశ్వసుందరి అందాల పోటీల్లో ‘మిసెస్ చికాగో యూనివర్స్- 2026’ టైటిల్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బొజ్జ సౌమ్యవాసు గెలుచుకున్నారు. అమెరికాలో స్థిరపడి, ప్రస్తుతం ఓ బహుళ జాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, సామాజిక కార్యకర్తగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్య ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు.

News September 15, 2025

NGKL: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతగా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 15, 2025

రాంనగర్‌లో మృత్యు నాలాలు!

image

భారీ వర్షం వస్తే ప్రాణాలు పోతున్నాయి. వరద ఉద్ధృతికి నాలా ప్రహరీలు పేక మేడళ్ల కూలిపోతున్నాయి. ఇది ఎప్పుడో ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు. ముషీరాబాద్, రాంనగర్‌‌లో ప్రతి ఏడాది ఇదే తంతు. నిన్న వినోభానగర్‌లో యువకుడు సన్నీ గల్లంతు ఆందోళనకు దారి తీసింది. అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొన్నారని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదని, గాలింపు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.