News May 1, 2024

రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం కేసు

image

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు 13 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. అలాగే గ్రామంలోకి అనుమతి లేకుండా వెళ్ల వద్దని పోలీసులు సూచించినా.. లెక్కచేయకుండా వెళ్లడంతో రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురిపై మరో కేసు నమోదు చేశారు.

Similar News

News December 18, 2025

చిత్తూరు: ఉగాదికి గృహప్రవేశాలు..!

image

చిత్తూరు జిల్లాలో వచ్చే ఉగాది నాటికి పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా హౌసింగ్‌పై CM సమీక్షించారు. జిల్లాలో PMAY కింద గతంలో 73,098 గృహాలు మంజూరు కాగా 58,966 పూర్తయ్యాయి. మరో 11,048 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. పాతవి 9,912 కొత్తగా మంజూరైన 2,105 గృహాలను కలిపి 12,048 గృహాలను ఉగాది నాటికి సిద్ధం చేయాలన్నారు.

News December 18, 2025

చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పార్కులు

image

చిత్తూరు జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 3 విడతల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో కుప్పం 34.57 ఎకరాలు(పొగురుపల్లి), పలమనేరు 4 ఎకరాలు(నంగమంగళం), రెండో విడతలో చిత్తూరులో 67.91 ఎకరాలు (వెంకటాపురం), నగరి 50 ఎకరాలు (మాంగాడు), పుంగనూరులో 21.08 ఎకరాల్లో పార్కులు నిర్మిస్తారు. మూడో విడతలో పూతలపట్టులో 87.75 ఎకరాలు, జీడీనెల్లూరులో 81.87 ఎకరాల్లో MSME పార్కులు ఏర్పాటు కానున్నాయి.

News December 18, 2025

డ్వాక్రా రుణాల్లో వెనుకబడ్డ చిత్తూరు

image

డ్వాక్రా రుణాల పంపిణీలో చిత్తూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో డ్వాక్రా సంఘాల లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయడంలో అధికారులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. MCP-1(ఉత్పాదక రుణాలు), MCP-2 (విని యోగ రుణాలు) కింద 63% రుణాలను మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు రూ.2427.51 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.1527.24 కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా పంపిణీ చేశారు.