News September 24, 2024
రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 3న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమౌతాయి. 9వ తేదీన స్వామి వారి కళ్యాణం, 12వ తేదీన పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News December 19, 2025
జిల్లాలో 1.99 లక్షల మంది చిన్నారులే లక్ష్యం: VZM DMHO

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.జీవినరాణి తెలిపారు. స్థానిక కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. 1180 బూతులు, 2360 బృందాలు ఏర్పాటు చేయగా, 2,45,667 OPV డోసులు సిద్ధంగా ఉంచామన్నారు.
News December 19, 2025
VZM: కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

నైపుణ్య శిక్షణ, గృహనిర్మాణం, మున్సిపల్ సేవల్లో మెరుగైన పనితీరుతో విజయనగరం జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. IVRS సర్వేలో 69.14% సానుకూల స్పందన లభించింది. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రంలో 3వ స్థానం, పీఎంఏవై గృహనిర్మాణంలో 4వ స్థానం సాధించింది. PGRSలో ఫిర్యాదులకు సానుకూల అభిప్రాయం వచ్చింది.
News December 19, 2025
విజయనగరం జిల్లాలో MSME కేంద్రానికి గ్రీన్ సిగ్నల్: మంత్రి

అనంతపురం, విజయనగరాల్లో 2 కొత్త MSME విస్తరణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. సీఎం చంద్రబాబు ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా సాంకేతిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, ఇంక్యుబేషన్ సేవలు అందించి.. కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు.


