News June 29, 2024

రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

image

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

Similar News

News July 1, 2024

ప్రకాశం: వెబ్‌సైట్లో టెన్త్ మార్కుల జాబితా

image

పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.

News July 1, 2024

కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం

image

కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 1, 2024

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి.. 

image

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.