News February 24, 2025
రామతీర్థంలో శివరాత్రికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరిగే శివరాత్రి జాతర ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ గణేశ్‌తో కలిసి రామతీర్థంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆలయ ఈఓ శ్రీనివాసరావుతో చర్చించారు.
Similar News
News March 3, 2026
డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.
News March 3, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరంలోని వైష్ణవ వీధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాయుడు ప్రసాద్ (43) సోమవారం తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో SI కమల్ భార్గవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News March 3, 2026
VZM: ఇంట్లోవారిని బెదిరిద్దామని గడ్డిమందు తాగిన వ్యక్తి..

విజయనగరం (D) రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న జగ్గునాయుడిని కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.


